ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన రెండు మందుపాతరలను గాలింపు బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీలో మల్కన్‌గిరి జిల్లా జొడొంబో పోలీసుస్టేషన్ పరిధిలో జాజుపాలెం-కెందుగుడా వద్ద నిర్మాణం జరుగుతున్న రహదారిలో వాటిని గుర్తించారు. బీఎస్ఎఫ్, ఒడిశా పోలీసులు కలిసి తనిఖీలు నిర్వహించి రెండు టిఫిన్ ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు.
ఏవోబీలో రెండు మందుపాతరలు స్వాధీనం.. తప్పిన ముప్పు
భద్రతా బలగాలే లక్ష్యంగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన రెండు మందుపాతరలను బీఎస్ఎఫ్, ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే బాంబు నిర్వీర్యం చేసే బృందాలను పిలిపించి మందుపాతరలను తొలగించారు.
ఏవోబీలో రెండు మందుపాతరలు
గాలింపునకు వస్తున్న ఆంధ్రా-ఒడిశా బలగాలను తుదముట్టించడానికే మావోయిస్టులు మందుపాతరలు ఏర్పాటు చేశారు. దీనిపై కచ్చితమైన సమాచారం అందుకున్న బీఎస్ఎఫ్, ఒడిశా పోలీసులు తనిఖీలు చేపట్టి మందుపాతరలను గుర్తించారు. వెంటనే బాంబు నిర్వీర్యం చేసే బృందాలను పిలిపించి వాటిని తొలగించారు. ఒక్కొక్క మందుపాతర 2.5 కిలోలు బరువు ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి:vishaka Cross fire: బూటకపు ఎన్కౌంటర్ కాదు.. పక్కా సమాచారంతోనే: ఓఎస్డీ సతీష్ కుమార్