విశాఖలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దౌర్యన్యానికి పాల్పడిన ఇద్దరు విలేకరులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ సురేష్‌బాబు తెలిపారు. బుధవారం సాయంత్రం సీహెచ్ సర్వారావు, గల్లా గోవింద్ మద్యం తాగి ద్విచక్రవాహనంపై గాజువాక నుంచి కాన్వెంట్ కూడలి వైపు వస్తున్నారు. కాన్వెంట్ కూడలి సిగ్నల్ వద్ద వీరు ఓ కారును ఢీకొట్టి కింద పడ్డారు. కారు చోదకుడు, ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.
పోలీసులపై దౌర్జన్యం: ఇద్దరు విలేకరుల అరెస్టు - విశాఖలో ఇద్దరు విలేకరుల అరెస్టు
విశాఖలో పోలీసులను దుర్భాషలాడిన ఇద్దరు విలేకరులను అరెస్టు చేసినట్లు డీసీపీ సురేష్ బాబు తెలిపారు. ఆ విలేకరులు ఇద్దరూ మద్యం తాగి ఉన్నారని డీసీపీ వెల్లడించారు. వారిద్దరూ అనకాపల్లిలో ఓ టీవీ ఛానెల్, స్థానిక పత్రికలో విలేకరులుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ
అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ప్రకాష్, హోంగార్డు రవి అక్కడికి వెళ్లగా సర్వారావు, గోవింద్ వారిపై దౌర్జన్యానికి పాల్పడి దుర్భాషలాడారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అనకాపల్లిలో ఓ టీవీ ఛానెల్, స్థానిక పత్రికలో విలేకరులుగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: తెలుగునాట వినోదాల వీచిక.. 'ఈటీవీ' రజతోత్సవ వేడుక