students missing at sea: విశాఖ జిల్లా భీమిలి సముద్ర తీరంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. సంగివలస అనిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సవం చదువుతున్న కుడితి సాయి, యామల సూర్య అనే విద్యార్థులు.. భీమిలి బీచ్‌లో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు. కళాశాలకు వెళ్లిన తమ పిల్లలు.. సముద్రంలో గల్లంతయ్యారనే వార్త తెలియడంతో తల్లిదండ్రులు భీమిలి తీరానికి చేరుకుని...కన్నీరు మున్నీరుగా విలపించారు. గల్లంతయిన విద్యార్థుల ఆచూకీ కోసం సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. కుడితి సాయి..మధురవాడ సమీపంలోని కార్‌షెడ్, సూర్య పెందుర్తికి చెందినవారుగా గుర్తించారు.
భీమిలి బీచ్‌లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు.. గాలిస్తున్న సిబ్బంది
Two engineering students missing at sea: సరదా కోసం సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతైన ఘటన విశాఖలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న తీరం రక్షణ సిబ్బంది ఆ ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సముద్ర తీరంలో గల్లంతైన విద్యార్థులు