ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణా... రెండు ట్రాక్టర్లు పట్టివేత - అక్రమ ఇసుక తరలింపును అడ్డుకున్న దేవరాపల్లి పోలీసులు

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు.. ఇద్దరు చోదకులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం ముసిడిపల్లి కూడలి వద్ద ఆ వాహనాలను పట్టుకున్నట్లు ఎస్సై సింహాచలం తెలిపారు.

sand illegal transportation
సీజ్ చేసిన ట్రాక్టర్లు

By

Published : Dec 25, 2020, 3:49 PM IST

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు చోదకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సింహాచలం తెలిపారు. ఎం. అలమండ మీదుగా వెళ్తున్న వాహనాలను.. ముసిడిపల్లి కూడలి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇసుకతో దొరికిన ఆ ట్రాక్టర్లను దేవరాపల్లి పోలీసు స్టేషనుకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details