gas leak: విశాఖ పరవాడ ఫార్మాసిటీలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికుల మృతి - విశాఖలో ఇద్దరు మృతి
06:08 November 29
Two suspected deaths in Visakhapatnam
gas leak: విశాఖ పరవాడలోని ఫార్మాసిటీలోని కర్మాగారంలో..విషవాయువులు లీకై ఇద్దరు ఉద్యోగులు చనిపోయారు. రాంకీ డెవలపర్స్‌గా ఉన్న పంప్‌హౌస్ వాలు ఓపెన్ చేస్తుండగా విషవాయువులు లీకయ్యాయి. అక్కడే ఉన్న తుని, పాయకరావుపేట ప్రాంతాలకు చెందిన మణికంఠ, దుర్గా ప్రసాద్ అనే ఒప్పంద ఉద్యోగులు విషవాయువులు పీల్చి చనిపోయారు. మృతి చెందిన ఇద్దరు కార్మికుల మృతదేహాలని కేజీహెచ్‌కు తరలించారు. రాంకీ యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే తమ వారు ప్రాణాలు కోల్పోయారని మృతుల కుటుంబ సభ్యులు.. ఆందోళనకు దిగారు.