రెండు రోజులుగా కురిసిన వర్షానికి విశాఖ జిల్లాలోని 3 వేల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. బుచ్చెయ్యపేట, చీడికాడ,ఎస్ రాయవరం, పాయకరావు పేట,అచ్యుత పురం,కశింకోట,మాడుగుల, చోడవరం,పాడేరు మండలాల్లో ... మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో వరి పొలాలు నీట మునిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు .
విశాఖలో వరి పంటకు భారీగా నష్టం
విశాఖలో రెండు రోజులుగా కురిసిన వర్షానికి వరి పంటకు భారీగా నష్టం వాటిల్లింది. 3 వేల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. కోత కోసిన ధాన్యం ..వర్షానికి తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
విశాఖలో వరి పంటకు భారీగా నష్టం
నివర్ తుపాను ముప్పు ఉండటంతో మళ్లీ భారీ వర్షాలు వస్తాయనే భయం రైతులను కలవరపెడుతోంది. కోతలు కోసి ఎండ బెట్టిన ధాన్యం కూడా వర్షానికి తడిసి ముద్దవడంతో ఆవేదన చెందుతున్నారు. వర్షాలు తగ్గిన తరవాత మరో మారు పూర్తి పంట నష్ట అంచనా వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇదీ చదవండీ...నెల్లూరుకు 'నివర్' ఎఫెక్ట్.. ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు