జీవో నెం 3 రద్దుకు నిరసనగా గిరిజన ప్రాంతాల్లో రాష్ట్ర గిరిజన ఐకాస్ బంద్కు పిలుపునిచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వంద శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాడేరులో ఆందోళనకారులు రహదారికి అడ్డంగా వాహనాలు నిలిపి నిరసన వ్యక్తం చేశారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేవేశారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో జీవో 3 పై చర్చ చేపట్టాలని కోరారు.
48 గంటల బంద్కు గిరిజన ఐకాస పిలుపు - two days bandh in visakha agency
48 గంటల పాటు గిరిజన ప్రాంతాల్లో బంద్ పాటించాలని రాష్ట్ర గిరిజన ఐకాస పిలుపునిచ్చింది. జీవో నెం 3 పునరుద్ధరించే వరకు పోరాటం ఆపేదిలేదని సంఘ నేతలు తేల్చిచెప్పారు.
![48 గంటల బంద్కు గిరిజన ఐకాస పిలుపు two days bandh by state tribal ikasa in visakha tribal agency against go no 3 issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7647949-297-7647949-1592363800462.jpg)
రెండు రోజుల పాటు విశాఖ మన్యంలో గిరిజన ఐకాస ఆధ్వర్యంలో బంద్