విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం బ్యాంక్ కాలనీలో రెండు పాజిటివ్ కేసులను అధికారులు గుర్తించారు. ఈ కేసులతో కలిపి పట్టణ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. చాప కింద నీరులా పెరుగుతున్న కేసుల వల్ల పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణ పురపాలక శాఖ అధికారులు, పోలీసులు, వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. కొవిడ్ కేసులు నమోదైన ప్రదేశాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు.
నర్సీపట్నంలో మరో రెండు కరోనా కేసులు..భయాందోళనలో ప్రజలు - narsipatnam latest corona news
నర్సీపట్నంలో సోమవారం రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బ్యాంకు కాలనీలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.
బ్యాంకు కాలనీలో రెండు కరోనా పాజిటివ్ కేసులు