విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా.... మూగ జీవాలు బలైపోతున్నాయని విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ౦ పెంటకోట గ్రామ రైతులు తెలిపారు. విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ చర్యలు లేకపోవడంతో పాడి పశువులు మృత్యువాత పడుతున్నాయి. తాజాగా ఆదివారం తాతారావు, నాగసూరిలకు చెందిన పశువులు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాయి. సమస్యను గతంలో అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టి౦చుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు.
విద్యుత్త్ షాక్తో రెండు పాడి పశువుల మృతి - పాయకరావుపేట వార్తలు
విద్యుత్త్ షాక్ తగిలి రెండు పాడిపశువులు మృత్యవాత పడ్డ సంఘటన విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని పెంటకోట గ్రామంలో చోటుచేసుకుంది.
పెంటకోటలో విద్యుత్త్ షాక్తో పశువుల మృతి