విశాఖ జిల్లా కశింకోట మండలం అడ్డామ్ గ్రామంలోని ఏలేరు కాలువలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను కాలువలో గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనకాపల్లి గ్రామీణ సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. వీరిద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే మృతుల వివరాలు తెలియకపోవడంతో.. గుర్తు తెలియని మృతదేహాలుగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచినట్లు సీఐ వెల్లడించారు.
ఏలేరు కాలువలో రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం - విశాఖ ఏలేరు కాలువలో గుర్తు తెలియని మృతిదేహాలు
విశాఖ ఏలేరు కాలువలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. గుర్తు తెలియని ఓ మహిళ, బాలిక మృతదేహాలను గుర్తించారు.

ఏలేరు కాలువలో రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం