విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి చెస్, బాక్సింగ్ పోటీల్లో నర్సీపట్నంకు చెందిన 12మంది విద్యార్థులు వివిధ పతకాలను పొందారు. వీరిలో కే.కృష్ణవేణి, హర్షవర్ధన్, పురుషోత్తం వికాస్ అనే విద్యార్థులు బంగారు పతకాలు సాధించగా.. మరో ఐదుగురు రజితాన్ని సొంతం చేసుకున్నారు. మరో ముగ్గురికి కాంస్య పతకాలు లభించాయి. జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో పట్టణానికి చెందిన అభిరాం, లక్ష్మీనారాయణ బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. వీరికి పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణరావు, నింజాస్ అకాడమీ నిర్వాహకులు అబ్బాస్.. అభినందనలు తెలిపారు.
రాష్ట్రస్థాయి చెస్, బాక్సింగ్ పోటీల్లో నర్సీపట్నం విద్యార్థుల ప్రతిభ - విశాఖలో రాష్ట్ర స్థాయి చెస్, బాక్సింగ్ పోటీలు
విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చెస్, బాక్సింగ్ పోటీల్లో 12 మంది నర్సీపట్నం విద్యార్థులు ప్రతిభ చూపారు. వీరికి పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణరావు, నింజాస్ అకాడమీ నిర్వాహకులు అబ్బాస్.. ప్రత్యేక అభినందనలు తెలిపారు.

రాష్ట్ర స్థాయి చెస్, బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన నర్సీపట్నం విద్యార్థులు