విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో తుమ్మపాల చక్కెర కర్మాగారంలో పనులు నిలిపివేశారని... ఫలితంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించి ఉపాధి కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు కర్మాగారం ఎదుట మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. కార్మికులకు 2018 సెప్టెంబర్ నుంచి ఇవ్వాల్సిన జీతాలు వెంటనే చెల్లించాలని కోరారు. చనిపోయిన కార్మికులకు పెన్షన్ వచ్చేలా చూడాలన్నారు. పాదయాత్రలో భాగంగా కర్మాగారాన్ని ఆధునీకీకరించి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని జగన్ హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక విస్మరించారని వాపోయారు. ఇకనైనా కర్మాగారంపై సీఎం జగన్ దృష్టిసారించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని ఆధునీకీకరించాలి: కార్మికులు - vishaka district latest news
తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని ఆధునీకీకరించి తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికుల డిమాండ్ చేశారు. సీఎం జగన్ పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని ఆధునీకరించాలి: కార్మికులు
TAGGED:
tummala sugar factory