సాంకేతికతతో కచ్చితమైన వాాతావరణ సమాచారం దేశ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను కచ్చితంగా అంచనా వేయడంలో సాంకేతిక పద్ధతులు దశల వారీగా భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వాతావరణ విభాగం అందిపుచ్చుకుంటోంది. వీటిలో నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో వాతావరణ స్థితిగతులను అంచనా వేయడంలో పూర్తిస్థాయి పరిపక్వత, కచ్చితత్వం సాధించగలిగింది. ఈ వివరాలు రైతులకు విలువైన సమాచారాన్ని సకాలంలో అందిస్తున్నాయి.
గతంలో కన్నా మెరుగ్గా
గతంలో కన్నా మెరుగ్గా వాతావరణ పరిస్థితులు అంచనా వేసి త్వరితగతిన సమాచారం ఇవ్వగలుగుతున్నామని భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వశాఖ వివరిస్తోంది. విశాఖలో ఇండియన్ మెటిరియలాజికల్ సొసైటీ నిర్వహిస్తున్న సదస్సులో ఈ అంశాలపై సూక్ష్మస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. వర్షం వచ్చే మూడురోజుల ముందుగా మాత్రమే హెచ్చరిక జారీ చేయగలుతున్నారని శాస్త్రవేత్తలు అంటున్నారు. చెన్నై, ముంబయి వంటి మహా నగరాల్లో తలెత్తుతున్న తీవ్ర వర్షపాతం, వరదలు పరిస్థితిని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేసి వివరాలు వెల్లడికి ప్రత్యేక ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
భూకంపాలను ముందుగా గుర్తించలేకపోతున్నాం
భూకంపాలను సంబంధించి ముందుగా హెచ్చరించే పరిస్థితి లేదని, రిక్టర్ స్కేల్‌పై మూడుకు మించి ఉన్న భూకంప తీవ్రత అంచనా వేసి చెప్పగలుగుతున్నామని భూ విజ్ఞానశాస్త్ర మంత్రిత్వశాఖ వివరిస్తోంది. హిమాలయాల్లో తరుచూ సంభవించే భూకంపాల ప్రభావం దిల్లీపై ఉంటోందని, అక్కడ నుంచి సమాచార వ్యవస్థ సక్రమంగా లేకపోవడం సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపింది.
ఇదీ చదవండి :
పోయిన బంగారాన్ని... ఆరు గంటల్లోనే అప్పజెప్పారు..!