ప్రజాకవి వంగపండు ప్రసాద్‌కు విశాఖ జిల్లా అంబేడ్కర్ విగ్రహం వద్ద కళాకారులు నివాళులర్పించారు. దివంగత వంగపండు ప్రసాద్ సంస్మరణ కార్యక్రమాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిర్వహించారు. ఉత్తరాంధ్ర పరిసరాలు ప్రశ్నించే తీరుతో రూపొందించిన గీతాన్ని ప్రజా గాయకుడు దేవిశ్రీ ఆలపించారు. దళిత ప్రజా కళాకారుడు ఉదయ భాస్కర్ వంగపండు జన గీతాల ప్రత్యేకతను వివరించారు. కార్యక్రమంలో డప్పు కళాకారుడు తాతాజీ, ఉత్తరాంధ్ర జేఏసీ నాయకుడు జె. టి. రామారావు, ఎం. నాగేశ్వరరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లా అంబేడ్కర్ విగ్రహం వద్ద వంగపండుకు నివాళులు - విశాఖ జిల్లాలో వంగపండుకు నివాళులు వార్తలు
దివంగత వంగపండు ప్రసాద్ సంస్మరణ కార్యక్రమాన్ని విశాఖ జిల్లా ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు.
విశాఖ జిల్లా అంబేద్కర్ విగ్రహం వద్ద వంగపండుకు నివాళులు
ఇదీ చూడండి.
కరోనాను తరిమికొట్టే పని.. మొత్తం సమాజానిది