ఈ నెల 7న భీమవరంలో జరిగిన సీనియర్ రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో మెడల్ కైవసం చేసుకున్న వెంకటేష్‌ను పలువురు సన్మానించారు. విశాఖ నగరానికి చెందిన వెంకటేష్ మిస్టర్ ఇండియా అయిన తన తండ్రి స్ఫూర్తితో కొన్నేళ్లుగా బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో భీమవరంలో జరిగిన బాడి బిల్డింగ్ పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. వెంకటేష్‌ను మాజీ కార్పొరేటర్ జియ్యాని శ్రీధర్, ఏపీ యువజన ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు ఆడారి కిషోర్ కుమార్‌లు సన్మానించారు.