గతనెల 30న పోలీసుల కాల్పుల్లో చనిపోయిన గిరిజనుడికి మావోయిస్టులకు ఎలాంటి సంబంధం లేదని... ఎంకెవిబి డివిజనల్ కమిటి కార్యదర్శి కైలాసం ఓ ఆడియోటేపు విడుదల చేశారు. గతనెల 30న మల్కన్‌గిరి జిల్లా మడకపొదర్ పంచాయతీ గొడబెడ వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో... ఏం తెలియని గిరిజనుడిని కాల్చి చంపి... మావోయిస్టు ముద్ర వేశారని ఆరోపించారు. ఆరోజు రాత్రి 8 గంటల సమయంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని వివరించారు.
ఆ సమయంలో పార్టీ వారంత తప్పించుకోగా ఆమాయక గిరిజనుడ్ని కాల్చి చంపారని కైలాసం ఆరోపించారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతనెల 16న డకోడ్‌పొదర్ వద్ద చేపలు పట్టడానికి వెళ్లిన రాజును పోలీసులు తీసుకెళ్లారని... నేటికి ఆ యువకుడి జాడలేదన్నారు. బోండా ఘాట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బీఏస్‌ఎఫ్ క్యాంపు కారణంగా మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని ఆరోపించారు.