పాత కక్షను మనసులో పెట్టుకుని.. నాటుతుపాకితో కాల్చేశాడు - మర్డర్
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ఓ గిరిజనుడు..మరో గిరిజనుడి ప్రాణాలు తీశాడు. ఎందుకు చంపాడు? ఎవరైనా చేయించారా? ఆస్తి తగదాలా? అని ఆరా తీసిన పోలీసులకు పాతగొడవలనే సమాచారం తెలిసింది.
tribe_killed_another_tribe_with_local_made_gun
పాతగొడవలు వ్యక్తి ప్రాణాలు బలితీసుకున్నాయి. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం ఆర్.కొత్తూరులో సాయంత్రం ప్రశాంతంగా ఉన్న సమయంలో... ఒక్కసారిగా తుపాకి పేలిన చప్పుడు కలకలం సృష్టించింది. ఓ గిరిజనుడే మరో గిరిజనుడిని కాల్చి చంపాడు. మృతుడిని జంపా శ్రీనుగా...హత్య చేసిన వ్యక్తిని కురుజు రమణగా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Jul 15, 2019, 2:04 AM IST