విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం పంచాయతీ గుంటి బొడ్డ గెడ్డలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిపుత్రులు ఆందోళన చేపట్టారు. రోడ్డు సదుపాయం లేక అవస్థలు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు, వంతెన నిర్మించాలని గిరిజనుల ఆందోళన - Tribals protest for roads latest news
రోడ్డు, వంతెన నిర్మించాలని విశాఖ జిల్లాలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. రోడ్డు లేక ఏళ్ల తరబడి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
రెల్లలపాలెం గిరిజన గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం వచ్చినా డోలి కట్టుకొని ఐదు కిలోమీటర్లు కాలినడకన నడిచి ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని... మైదాన గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. గిరిజన గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్టు పాలకులు ఊదరగొడుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా అభివృద్ధి జాడ కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి గుంటి బొడ్డ గెడ్డపై వంతెన నిర్మించి, రెల్లలపాలెం వరకు రోడ్డు సదుపాయం కల్పించాలని కోరారు.
ఇవీ చూడండి...