జీవో 3 రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటిస్తూ సుప్రీంకోర్టు కొట్టివేయడంపై విశాఖ మన్యంలో గిరిజన సంఘం నిరసనలు చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ ఏరియాలో ఉపాధ్యాయ పోస్టులను 100 శాతం ఎస్టీ అభ్యర్థులతో భర్తీ చేయాలని అప్పటి ప్రభుత్వం జీవో 3 ను జారీ చేసింది. ఆ జీవో ద్వారా ఎలాంటి ఉపాధ్యాయ నియమాకాలు చేపట్టవద్దని తాజాగా సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో గిరిజనులు కోర్టు తీర్పు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
'జీవో 3 కొట్టివేతపై.. ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేయాలి' - జీవో 3పై సుప్రీంకోర్టు తీర్పు వార్తలు
జీవో 3 ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేయాలంటూ విశాఖ మన్యంలో గిరిజనులు డిమాండ్ చేశారు.
tribals protest in vishaka