ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏవోబీలో గిరిజనుల ర్యాలీ... మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు - tribals protest in aob

మావోయిస్టుల అడ్డాగా పేరుగాంచిన ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దు క‌టాఫ్ ఏరియాలో మావోయిస్టుల‌కు వ్య‌తిరేకంగా గిరిజ‌నులు ర్యాలీ నిర్వహించారు. మా ప్రాంతాల అభివృద్ధికి మీరే నిరోధకులు అంటూ నినాదాలు చేశారు. ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.

tribals protest in aob saying maoists must live that place
ఏవోబీలో గిరిజనుల ర్యాలీ

By

Published : Sep 7, 2020, 3:40 PM IST

మావోయిస్టుల షెల్ట‌ర్ జోన్‌లో మావోయిస్టుల‌కు వ్య‌తిరేకంగా గిరిజ‌నులు ర్యాలీ నిర్వ‌హించారు. మావోయిస్టుల అడ్డాగా పేరుగాంచిన ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దు క‌టాఫ్ ఏరియాలో మావోయిస్టుల‌కు వ్య‌తిరేకంగా గిరిజ‌నులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వ‌హించారు. 'మా ప్రాంతాల అభివృద్ధికి మీరే నిరోధకులు... త‌క్ష‌ణ‌మే క‌టాఫ్ ఏరియాను విడిచి వెళ్లిపోవాలి' అంటూ మావోయిస్టులకు సూచించారు.

గిరిజ‌న ప్రాంతంలో ఉంటూ గిరిజ‌నుల‌ను ఇన్‌ఫార్మ‌ర్ల పేరిట హ‌త‌మారుస్తున్న మావోయిస్టు నాయ‌కులు ఇక్క‌డనుంచి వెళ్లిపోండి అంటూ నినాదాలు చేశారు. 'మాకు హింస అక్కర్లేదు, శాంతి కావాలి' అంటూ సందేశాన్ని ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్ర‌భుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని గిరిజన నాయకులు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details