విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని గుడివాడ - జాజులపాలెం మధ్య రోడ్డును నిర్మించాలని స్థానిక ప్రజలు గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆదివాసులు పడుతున్న ఇబ్బందులు 'ఈటీవీ - ఈటీవీ భారత్'లో ప్రసారం కావడం వల్ల సమస్యపై గిరిజన సంఘం నేతలు స్పందించారు. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించకపోతే స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సంఘం నేత నరసింహ మూర్తి హెచ్చరించారు.
చీడికాడ మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు గెడ్డపై తాత్కాలిక కాలిబాట కొట్టుకుపోయిందని మట్టిరోడ్డు ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ వంతెన నిర్మించాలని ర్యాలీ చేశారు. తక్షణమే అధికారులు స్పందించాలని ప్రజలు కోరారు.