ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రహదారి నిర్మించుకున్నాం.. ఉపాధి హామీ కింద గుర్తించండి' - ఉపాధి హమీ పనుల కింద రోడ్డు నిర్మాణాన్ని గుర్తించాలని ఆదివాసుల నిరసన వార్తలు

విశాఖ జిల్లా కొయ్యూరు మండలం జాజులబంధ గ్రామానికి ఆదివాసులు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం రహదారిని నిర్మించుకున్నారు. ఆ పనులను ఉపాధి హామీ కింద పరిగణించి.. తక్షణమే నిధులు మంజూరు చేయాలని నిరసన వ్యక్తం చేశారు.

'రహదారి నిర్మించుకున్నాం.. ఉపాధి హామీ కింద గుర్తించండి'
'రహదారి నిర్మించుకున్నాం.. ఉపాధి హామీ కింద గుర్తించండి'

By

Published : Nov 10, 2020, 10:08 PM IST

కొయ్యూరు మండలం ఆదివాసులు.. తాము నిర్మించుకున్న రహదారిని ఉపాధి పనుల కింద గుర్తించాలని నెత్తిన బరువుతో నిరసన తెలిపారు. గిరిజన సంఘం, సీపీఎం సంయుక్త ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ గ్రామాలను పాడేరు ఐటీడీఎ పీఓ స్వయంగా పరిశీలన చేయాలన్నారు. ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి గతంలో ఎన్నోసార్లు రాజకీయ నాయకులకు, అధికారులకు వినతి పత్రాలు అందజేసినా ప్రయోజనం లేదని.. తామే స్వయంగా శ్రమదానంతో నిర్మాణం చేసుకున్నామని ఆదివాసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర దట్టంగా ఉన్న చెట్లను.. శ్రమదానం ద్వారా తొలగించి.. రహదారి ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details