విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం కించుమండలో గిరిజనులు ఆందోళన చేశారు. మెటల్ క్వారీ నిర్మాణానికి గ్రామసభ నిర్వహించడానికి వచ్చిన అధికారులకు సీపీఎం ఆధ్వర్యంలో కింసుమండ, కంబవలస గిరిజనులు నిర్మాణాలు చేపట్టవద్దంటూ నినాదాలు చేశారు. బోడిగాపుట్ నుంచి అరకువ్యాలీ, బల్లుగూడ వరకు 35 కి.మీ జాతీయ రహదారి నిర్మాణానికి... రూ 197 కోట్లతో ఓ కాంట్రక్టర్ టెండర్ వేశాడు. రహదారి కోసం మెటల్ రాళ్ల కోసం రెండు గ్రామాల సరిహద్దుల్లోని బండరాళ్లపై అతని కన్నుపడింది. మెటల్ క్వారీ తవ్వకాల వలన రెండు గ్రామాలకు చెందిన భూములను గిరిజనులు కోల్పోతారని సీపీఎం ఆందోళన వ్యక్తం చేసింది. క్వారీ వలన దుమ్ము ధూళితోపాటు, బ్లాస్టింగ్ వల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని నాయకులు వాపోయారు. తవ్వకాలకు అనుమతి ఇవ్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.
మెటల్ క్వారీ ఏర్పాటు చేయొద్దంటూ గిరిజనుల ధర్నా - కించుమండలో మెటల్ క్వారీ తాజా వార్తలు
మెటల్ క్వారీ ఏర్పాటు చేయొద్దంటూ విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం కించుమండ దగ్గర సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు ధర్నా చేశారు. ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
మెటల్ క్వారీ ఏర్పాటుచేయొద్దంటూ గిరిజనుల ధర్నా