ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డోలీలో గర్భిణీల మోత... ఎన్నటికి తీరని వ్యథ - visakha agency taja news

కష్టాలకు కేరాఫ్ అడ్రస్ గిరిపుత్రులు.. నిత్యవసరాలు తెచ్చుకోవాలంటే ఈతకొట్టుకుంటూ మైళ్ల దూరం పోవాలి.. సరైన రోడ్డు సదుపాయం లేక పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణీలను డోలికట్టి మోసుకు పోవాలి.. బాధను భరించలేక చనిపోయిన మహిళలు ఎందరో..నొప్పులు తట్టుకుని పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులూ ఉన్నారు..తాజాగా విశాఖ ఏజేన్సీ కొయ్యూరు మండలంలో పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను 2కిలోమీటర్లు డోలీలో మోసుకొచ్చి చికిత్స అందించారు.

tribals  facing problems due to lack off road facility in visakha agnecy
tribals facing problems due to lack off road facility in visakha agnecy

By

Published : Aug 28, 2020, 5:34 PM IST

పాడేరు ఏజెన్సీ కొయ్యూరు మండలం బురద రాళ్ల పంచాయతీ చౌడేపల్లి గ్రామంలో మొగ్గ వెంకట కుమారి ( 21 ) పురిటి నొప్పులతో బాధపడుతుంటే గ్రామస్థులు డోలి కట్టి రెండు కిలోమీటర్ల దూరంలోని సాకుల పాలెం గ్రామం వరకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి రాజేంద్రపాలెం కొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రోడ్డు సదుపాయం లేక గిరిజన గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రోడ్డు సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.

డోలీలో గర్భిణీల మోత... ఎన్నటికి తీరని వ్యథ

ABOUT THE AUTHOR

...view details