ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ల్యాండ్​మైన్ మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థికసాయం - paderu crime news

విశాఖ జిల్లాలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ల్యాండ్​మైన్ పేలి ఇద్దరు గిరిజనులు ఈనెల 2న మృతి చెందారు. ఈ ఘటనకు నిరసనగా వారి కుటుంబసభ్యులు పాడేరు ఐటీడీఏ వద్ద ఆందోళనకు దిగారు. వారికి తక్షణ పరిహారంగా ఒక్కో కుటుంబానికి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్ లక్ష రూపాయలు అందజేశారు.

tribals died with land mine blast in paderu vizag district
ల్యాండ్​మైన్ మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థికసాయం అందజేత

By

Published : Aug 7, 2020, 4:41 PM IST

విశాఖ జిల్లా పెదబయలు మండలం జామిగూడ పంచాయతీ చింతలవీధికి చెందిన మొండిపల్లి మోహన్ రావు, అజయ్ కుమార్​లు ఈనెల 2న పశువులకు మేత కోసం కొండ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ మావోయిస్టులు అమర్చిన ల్యాండ్​మైన్ పేలి వారిద్దరూ మరణించారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారమిచ్చినా మృతదేహాలను తరలించే వీలు లేకపోవటంతో గ్రామంలోనే ఖననం చేశారు.

దీనిపై శుక్రవారం పాడేరు ఐటీడీఏ వద్ద మృతుల కుటుంబీకులు ఆందోళనకు దిగారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమాయక గిరిజనులను చంపడానికేనా మీరున్నది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతులు కుటుంబీకులు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్​ను కలిశారు. ఆయన తక్షణ సహాయం కింద ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details