ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఖాతాలోని నగదు తీయాలంటే కమిషన్ చెల్లించాల్సిందే! - vishaka agency news

బ్యాంకు ఖాతాలోని నగదు తీసుకునేందుకు విశాఖ మన్యంలోని గిరిపుత్రులు అవస్థలు పడుతున్నారు. బ్యాంకు వద్ద గంటల తరబడి క్యూలో వేచి ఉన్నా నగదు విత్​డ్రా చేసేందుకు వీలు కావటం లేదు. వారి అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ప్రైవేట్ వ్యక్తులు... కమిషన్​ల పేరిట దోపిడీకి తెరలేపారు.

bank services in Hukumpeta
bank services in Hukumpeta

By

Published : Nov 8, 2020, 10:54 PM IST

గిరిజనుల ఆవేదన

విశాఖ మన్యంలో గిరిజనులకు బ్యాంకు సేవలు అందడం లేదు. వివిధ పథకాల కింద ప్రభుత్వం తమ ఖాతాలో వేసిన సొమ్ము తీసుకునేందుకు వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు మానుకుని బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. అయినప్పటికీ నగదు తీసుకునేందుకు వీలు కావటం లేదు. హుకుంపేట మండల కేంద్రంలో గతంలో విజయ బ్యాంకు ఉండేది. మూడు నెలల కిందట దానిని బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశారు. అప్పటినుంచి ఆ బ్యాంకు శాఖలో ఖాతాదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఎప్పుడు చూసినా తలుపులు మూసే ఉంటున్నాయి. కరోనా పేరుతో బ్యాంకు సిబ్బంది లావాదేవీలు తగ్గించేశారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు బ్యాంకు పక్కనే బ్యాంకు మిత్ర పేరిట ఓ ప్రైవేట్ కేంద్రం మొదలైంది. ప్రతి నగదు లావాదేవీకి గిరిజనుల నుంచి వారు రెండు రూపాయల చొప్పున కమిషన్ తీసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనులు... బ్యాంకులో పనులు కాకపోవటంతో పక్కనే ఉన్న ప్రైవేట్ కేంద్రానికి వెళ్తున్నారు. దీనివల్ల బ్యాంకు ఉన్నప్పటికీ ఖాతాదారులకు కష్టాలు తప్పడం లేదు.

బ్యాంకుకు ఎప్పుడు వచ్చినా సరే నెట్​వర్క్ లేదని, డబ్బులు లేవు అంటూ వివిధ కారణాలు చూపించి ఖాతాదారులను బ్యాంకు సిబ్బంది బయటికి పంపించేస్తున్నారని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. బ్యాంకులో సిబ్బంది కొరత కూడా ఉండటంతో లావాదేవీలు సక్రమంగా చేయటం లేదంటున్నారు. ఇప్పటికైనా బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి నగదు అందుబాటులో ఉంచాలని ఖాతాదారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి

ఏవోబీలో ఒడిశా డీజీపీ పర్యటన

ABOUT THE AUTHOR

...view details