గ్రానైట్, రియల్ఎస్టేట్ వ్యాపారస్తులు నుంచి తమ భూమిని రక్షించాలని డిమాండ్ చేస్తూ కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద గిరిజనులు ధర్నా నిర్వహించారు.
'వారి నుంచి మమ్మల్ని కాపాడండి' - నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద గిరిజనుల ధర్నా
డీఫారం భూముల్లో సాగు చేసుకుంటున్న తమను గ్రానైట్, రియల్ఎస్టేట్ వ్యాపారుల నుంచి కాపాడాలంటూ విశాఖ జిల్లా నర్సీపట్నంలో గిరిజనులు ఆందోళనకు దిగారు.
!['వారి నుంచి మమ్మల్ని కాపాడండి' tribals-agitation-at-narsipatnam-rdo-office-in-vishakapatnam-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8039945-606-8039945-1594827781532.jpg)
రావికమతం మండలం కవ్వగుంట గ్రామస్తులు కొన్ని సంవత్సరాల నుంచి డీ ఫారం పట్టా భూముల్లో జీడి మామిడి తోటలను పెంచుకుని ఉపాధి పొందుతున్నారు. తమ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని విశాఖ నగరానికి చెందిన కొంతమంది వ్యాపారులు రియల్ ఎస్టేట్ దారులు మరికొంతమంది గ్రానైట్ వ్యాపారస్తులు ఈ భూములపై కన్నేసి తమ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని గిరిజనులు ఆరోపించారు. దీనికి నిరసనగా నర్మీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తమ సమస్యపై విచారణ జరిపి న్యాయం చేయాలంటూ ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి:కలెక్టరేట్లో కరోనా కలకలం... నాలుగు రోజుల్లో 30 దాటిన కేసులు