ఇక్కడ జరుగుతోంది ఉపాధి హామీ పనులు కాదు. పలుగుపార పట్టిన వీళ్లంతా కూలీలూకాదు. వాళ్ల ఊరి అవసరం కోసం పలుగుపార పట్టిన మొనగాళ్లు. విశాఖ మన్యంలో కనీసం పాదబాట కూడా లేని లేని అనేక గూడేల్లో హుకుంపేట మండలం కొట్నాపల్లి కూడా ఒకటి. వ్యవసాయ ఉత్పత్తులు సంతలో అమ్ముకోవాలన్నా, రేషన్ తెచ్చుకోవాలన్నా, పిల్లల్ని బడికి పంపాలన్నా మరే అవసరం వచ్చినా ప్రధాన రహదారి వరకూ నడిచి వెళ్లాల్సిందే. ఎవరికైనా రోగం వస్తే డోలీ మోసుకుంటూ. దాదాపు 4కిలోమీటర్లు కొండ దిగి రావాలి. అందుకు కాలిబాట కూడా సరిగాలేదు. రోడ్డు వేయించాలంటూ 35 ఏళ్లుగా అధికారులకు లెక్కలేనన్న వినతి పత్రాలిచ్చి అలసిపోయారు. ఇక ఓపిక నశించింది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడడం ఆపేసి సమరశంఖం పూరించారు. గ్రామ యువత చందాలు వేసుకుని పలుగుపారలు కొని ఇదిగో ఇలా బాట నిర్మించుకుంటూ వెళ్తున్నారు.
ఉపాధి పథకంలో చేర్చాలని వినతి