విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లో శస్త్ర చికిత్స వికటించి గిరిజన మహిళ మృతి చెందింది. గిరిజనులు, గిరిజన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గిరిజన ప్రాంతమైన కొయ్యూరు మండలానికి చెందిన లావ రాజు అనే ఉపాధ్యాయుడు తన భార్య మల్లేశ్వరిని స్త్రీలకు సంబంధించిన వ్యాధి శస్త్ర చికిత్స నిమిత్తం నర్సీపట్నంలోని ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లో జాయిన్ చేశాడు.
శస్త్ర చికిత్సకు ముందు హిమోగ్లోబిన్ 11 పాయింట్లు ఉండటం వల్ల ఆపరేషన్ కు డాక్టర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మల్లేశ్వరి మృతి చెందింది. మృతురాలి భర్త రాజు ఇతర గిరిజన సంఘం ఉద్యోగులు.. వైద్యుని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు అరకు పార్లమెంట్ సభ్యురాలు భర్త ప్రసాద్, వైద్యులు ఇరు వర్గాలతో చర్చించి.. వివాదానికి తెర దించారు.