ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గిరిజనులకు వారి హక్కులను కల్పించండి' - విశాఖ మన్యంలో పరిరక్షణ ఐకాస ఛైర్మన్ పర్యటన వార్తలు

ఎన్నో ఏళ్లుగా గిరిజనులు అభివృద్ధికి దూరంగా బతుకుతున్నారని.. ఇప్పటికైనా వారి హక్కులను వారికి కల్పించాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ ఐకాస ఛైర్మన్ చెండా ఏలియా అన్నారు. గిరిజన ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tribal Rights Protection Committee chairman chenda yelia visit vizag agency areas
విశాఖ మన్యంలో ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఐకాస సభ్యుల పర్యటన

By

Published : Jul 13, 2020, 9:41 AM IST

ఎన్నో ఏళ్లుగా గిరిజనులు అభివృద్ధికి దూరంగా బతుకుతున్నారని ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఐకాస ఛైర్మన్ చెండా ఏలియా అన్నారు. వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆయా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. విశాఖ మన్యం గూడెం కొత్తవీధి మండలం దారకొండలో ఆయన పర్యటించారు.

ఏజెన్సీలో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెండా ఏలియా ఆరోపించారు. గిరిపుత్రులకు చెందవలసిన భూమిలో కొందరు అక్రమదారులు మైనింగ్ చేపడుతున్నారని మండిపడ్డారు. జీవో నెంబర్ 3ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాల, ఆస్పత్రులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. భూములు లేక గిరిపుత్రులు వలస కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారికి ఇళ్లు, సాగు పట్టాలు అందజేయాలని ఏలియా కోరారు.

ABOUT THE AUTHOR

...view details