గిరిజనులకు అటవీ హక్కుల పత్రాలు మంజూరు చేయాలని, నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా నాతవరంలో గిరిజనులు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ.. ఐదో షెడ్యూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఎన్నో సంవత్సరాలుగా పోడు భూములు సాగు చేస్తున్నప్పటికీ, నేటి వరకు వాటి హక్కు పత్రాలను మంజూరు చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు. అలాగే షెడ్యూల్ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చకపోవడం అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అర్హులైన గిరిజనులకు పట్టాలు ఇచ్చి గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ చేర్చడానికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నారాయణ మూర్తి రా,జు భాస్కర్ ప్రసాద్, దేవుడు పాల్గొన్నారు.
సీఐటీయూ ఐదో షెడ్యూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో గిరిజనుల ఆందోళన - నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు తాజా వార్తలు
సీఐటీయూ ఐదో షెడ్యూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో గిరజనులు ఆందోళన చేపట్టారు. గిరిజనులకు అటవీ హక్కుల పత్రాలు మంజూరు చేయాలని, నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.

సీఐటీయూ ఐదో షెడ్యూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో గిరిజనుల ఆందోళన