ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యం అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం: గిరిజనులు - వైద్యులను నియమించాలని సీలేరు పీహెచ్​సీ ఎదుట ధర్నా

స్థానిక పీహెచ్‌సీలో వైద్యులను నియ‌మించాలని డిమాండ్​ చేస్తూ... సీలేరు సమీపంలోని గిరిజ‌నులు పెద్దఎత్తున ధ‌ర్నా నిర్వ‌హించారు. సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

tribal protest at seleru phc in vishakapatnam district
వైద్యం అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం: గిరిజనులు

By

Published : Sep 23, 2020, 4:48 PM IST

సీజ‌న‌ల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న తరుణంలో వైద్యాధికారుల‌ను బ‌దిలీ చేయ‌డం అధికారుల నిర్ల‌క్ష్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని విశాఖపట్నం జిల్లా సీలేరు పీహెచ్​సీ పరిధి గ్రామాల‌కు చెందిన గిరిజ‌నులు పేర్కొన్నారు. వెంటనే వైద్యులను నియమించాలని డిమాండ్​ చేస్తూ... పీహెచ్‌సీ ఎదుట పెద్దఎత్తున ధ‌ర్నా నిర్వ‌హించారు.

స్థానిక పీహెచ్‌సీలో ప‌ని చేస్తున్న ఇద్ద‌రు వైద్య‌ధికారుల‌ను రెండు నెల‌ల క్రితం బ‌దిలీ చేశార‌ని, డాక్టర్లు, సిబ్బంది లేక చాలా ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సీలేరు ఎస్సై రంజిత్..​ ఘటనా స్థలానికి చేరకుని ఆందోళనకారులతో మాట్లాడారు. వెంటనే సమస్యను అదన‌పు జిల్లా వైద్యారోగ్య‌శాఖాధికారి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారి.... త్వరలో వైద్యులను నియమిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గిరిజనులు ఆందోళన విరమించారు.

ఇదీచూడండి:డిస్కంల ప్రైవేటీకరణకు ముసాయిదా.. అభిప్రాయాలు కోరిన కేంద్రం

ABOUT THE AUTHOR

...view details