విశాఖ ఏజెన్సీ.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల ఆదివాసీ ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. కూంబింగ్ బలగాలు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ, గ్రామాల గిరిజనులు, పెదబయలు మండలం ఇంజేరి పంచాయతీ ప్రజలు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తమపై మావోయిస్టుల ముద్రలు వేసి కుటుంబాలను రోడ్లుపైకి లాగుతున్నారని చెబుతున్నారు. అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా.. చిత్రహింసలకు గురిచేస్తున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవచూపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఏజెన్సీలో పోలీసులకు వ్యతిరేకంగా గిరిజనుల ఆందోళన - visakha latest news
ఆంధ్రా సరిహద్దులో.. విశాఖ ఏజెన్సీ పరిధిలోని గిరిజనులు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. మారుమూల గ్రామాల్లో మావోయిస్టుల పేరుతో చేస్తున్న దాడులు ఆపాలని నినాదాలు చేశారు.
ఏజెన్సీలో పోలీసులకు వ్యతిరేకంగా గిరిజనుల ఆందోళన