సకాలంలో వైద్యం అందక విశాఖ జిల్లాలో గిరిజన ప్రాంతానికి చెందిన ఓ బాలింత మృతి చెందింది. రావికమతం మండలం చలిసింగంలోని వంజరి రాజేశ్వరి అనే మహిళకు కాన్పు సమయం దగ్గర పడింది. బంధువులు ఆమెను కొండ మీదనున్న గ్రామం నుంచి కిందకు డోలీలో మోసుకొచ్చినా ఉపయోగం లేకుండా పోయింది.
చలిసింగం నుంచి కొండలు దిగి, గుట్టలు దాటుకుని గంటన్నర పాటు ప్రయాణి స్తే.. సీకయపాడు నుంచి రోడ్డు ఉంటుంది. బంధువులు ఎంతో కష్టపడి ఆ బాలింతను డోలీలో కిందకు మోసుకు వచ్చారు. 108 వాహనానికి ఫోన్ చేయగా.. స్థానికంగా అందుబాటులో లేదని సిబ్బంది సమాధానమిచ్చారు. అప్పటికే రాజేశ్వరి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు కోటవురట్ల నుంచి వచ్చిన అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేకపోవడంతో మరణించింది.