ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూపట్టాల కోసం గిరిజనుల పాదయాత్ర - vishakha agency

విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలో భూములకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా నాతవరంలో గిరిజనులు పాదయాత్ర నిర్వహించారు. శివారు సిరిపురం, ముంతమామిడి తదితర గ్రామాల గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను తమకే కేటాయించాలని కోరారు.

Breaking News

By

Published : Oct 25, 2020, 1:04 AM IST

విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలో భూములకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర నిర్వహించారు.

సుమారు ఏడు కి.మీ..

సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు సుమారు ఏడు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో లాటరైట్ ఖనిజ తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇస్తూ గిరిజనులు సాగు చేసుకుంటున్న రైతులకు ఇవ్వకపోవడం విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ వైఖరి మారట్లేదు..

మైనింగ్ తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నప్పటికీ గిరిజనుల పట్ల ప్రభుత్వ వైఖరి మారటం లేదని సీపీఎం నేత సత్తిబాబు మండిపడ్డారు. ఇందులో భాగంగానే సరుగుడు నుంచి సిరిపురం వరకు సుమారు ఏడు కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మాణానికి 2018లో మూడు కోట్ల 80 లక్షలు మంజూరు అయినప్పటికీ నేటి వరకు పనులు ప్రారంభించకపోవడం విచారకరమన్నారు.

ప్రయాణం నరకప్రాయం..

దీనికితోడు ఇటీవలే కురిసిన వర్షాలకు గతంలో నిర్మాణం చేసిన మెటల్ రోడ్డు మట్టి తదితర సామగ్రి కొట్టుకుపోవడం వల్ల ప్రయాణం నరకప్రాయంగా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని రహదారి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంతో పాటు గిరిజనులు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అడిగ రాజు, రెడ్డి నారాయణమూర్తి, చిన్నబ్బాయి , వెంకటేష్ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : 'అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలి'

ABOUT THE AUTHOR

...view details