జి. మాడుగలలో..
జి. మాడుగల మండలం మెండికోట గ్రామానికి చెందిన వంతల రాజు అనారోగ్యానికి గురయ్యాడు. అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సరైన మార్గం లేక.. గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న డబ్బగరువుకు డోలీలో తీసుకొచ్చి.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ప్రధాన రహదారులకు మారుమూల గ్రామాలు అనుసంధానం చేయకపోటంతోనే.. తమకు డోలీ మోతలు తప్పటం లేదని గ్రామ వాలంటీర్ చిన్నారావు వాపోయారు.
పాడేరులో..
పాడేరు మండలం మారుమూల సలుగు పంచాయతీ దబ్బగరువులో అప్పారావు అనే గిరిజనుడు చెట్టుపై నుంచి పడిపోయాడు. ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సరైన మార్గం లేకపోవటంతో.. 5 కిలోమీటర్లు డోలీలో మోసుకొని, ప్రధాన మార్గానికి తీసుకువచ్చారు. ప్రస్తుతం బాధితుడు పాడేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాలకులు మారినా.. తమ తలరాతలు మారటం లేదని గిరిజనలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:'అమ్మఒడి' డబ్బు బుడ్డీకి ఇవ్వలేదని.. భార్యను కొట్టిచంపిన భర్త..