తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ విశాఖ జిల్లా మాడుగుల మండలం అజయపురం గిరిజన గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ఊరికి అర కిలోమీటర్ దూరంలో బావి నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని... ఇప్పటికైనా అధికారులు స్పందించి పైపులైన్ వేసి కుళాయిను ఏర్పాటు చేయాలని కోరారు. కలుషిత నీరు తాగడం వల్ల రోగాల బారిన పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి భవానీ, మైదాన గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి గిరిజనులతో కలిసి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
తాగునీటి సౌకర్యం కల్పించాలంటూ ఖాళీ బిందెలతో నిరసన - మాడుగుల మండల వార్తలు
తమకు తాగునీటి సౌకర్యం కల్పించాలంటూ విశాఖపట్నం జిల్లాలో అజయపురం గిరిజన గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. తాగు నీటిని తెచ్చుకోవాలంటే ఊరికి అర కిలోమీటర్ దూరం వెళ్లాల్సి వస్తుందని ... అధికారులు స్పందించి పైపులైన్ వేసి కుళాయిను ఏర్పాటు చేయాలని కోరారు.
తాగునీటి సౌకర్యం కల్పించాలంటూ ఖాళీ బిందెలతో నిరసన