విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి ఎంపీడీవో కార్యాలయం ఎదుట గిరిజనులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం గిరిజనులకు స్వయం ఉపాధి నిమిత్తం ట్రైకార్ రుణాలు మంజూరు చేయడానికి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తులు చేసినవారంతా ఎంపీడీవో కార్యాలయానికి రావాలని అధికారులు ప్రకటన చేశారు. చుట్టు పక్కల పంచాయితీలకు చెందిన రెండు వేల మంది గిరిజనులు తగిన ధృవపత్రాలుతో మండల కేంద్రానికి చేరుకుని ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అయితే ఇంటర్వ్యూలు నిర్వహించాల్సిన బ్యాంకు మేనేజర్ సకాలంలో రాలేదు. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి హడావిడిగా దరఖాస్తులను పరిశీలించి తిరస్కరించారని గిరిజనులు ఆరోపించారు. ఇదేమని అడిగితే మధ్యలోనే వెళ్లిపోయారని ఆవేదన చెందారు. అంతా కలిసి నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
''దరఖాస్తులు పరిశీలించకుండా.. ఎలా తిరస్కరిస్తారు?'' - విశాఖ మన్యంలో గిరిజనుల ఆందోళన
ట్రైకార్ రుణాలకు దరఖాస్తు చేసుకున్న గిరిజనులు విశాఖ జిల్లా గూడెం కొత్త వీధిలో.. ఆందోళనకు దిగారు. బ్యాంకు మేనేజరు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ట్రైకార్ రుణాలు తిరస్కరించారని గిరిజనుల ఆందోళన