ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య - visakhapatnam district latestnews

విశాఖ జిల్లా అందాల వాకపల్లిలో మావోయిస్టుల చేతిలో హత్య కాబడిన గిరిజనుడి మృతదేహానికి శవ పంచనామా పూర్తిచేసి పోలీసులు బంధువులకు అప్పగించారు.

పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య

By

Published : Dec 14, 2020, 11:35 AM IST

Updated : Dec 14, 2020, 7:26 PM IST


విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం వాకపల్లిలో పోలీస్ ఇన్​ఫార్మర్ నెపంతో హత్య చేసిన గిరిజనుడు గెమ్మెలి కృష్ణారావు మృతదేహానికి పాడేరు ఆస్పత్రిలో శవ పంచనామా పూర్తి చేశారు. మృతదేహాన్ని పాడేరు డీఎస్పీ రాజ్ కమల్ సీఐజీడి బాబు, బంధువులకు అప్పగించారు. ఆసుపత్రి వాతావరణంలో బంధువుల రోదనలు మిన్నంటాయి.

తన భర్త ఇన్​ఫార్మర్​ కాదని... సమాచారం లేకుండానే మావోయిస్టులు పొట్టన పెట్టుకున్నారని మృతుృడి భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణారావుకి నలుగురు పిల్లలు ఉన్నారు.

Last Updated : Dec 14, 2020, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details