ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోడు భూముల్లో పంటలు తొలగించి.. ఇళ్ల స్థలాల కోసం సేకరించారు! - ముళ్లమెట్టలో గిరిజనుల తాజా వార్తలు

విశాఖ జిల్లా పాడేరు పరిధిలోని ముల్లు మెట్టలో ఇళ్లస్థలాల కోసం.. గిరిజనుల పంటలను అధికారులు ధ్వంసం చేశారు. ఇప్పటివరకు వారికి పట్టాలు ఇవ్వట్లేదని.. అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని గిరిజనులు ఆరోపించారు.

tribal land problems in mullumetta at paderu
ముళ్లమెట్టలో పోడుభూములు

By

Published : Jul 11, 2020, 4:32 PM IST

ముళ్లమెట్టలో పోడుభూములు

పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిన అధికారులు.. గిరిజనుల పంటలను నాశనం చేసి ఆ స్థలాలను ఇళ్లపట్టాలకు కేటాయిస్తున్నారు. విశాఖ జిల్లా పాడేరు పరిధిలోని ముల్లుమెట్టలో రెవెన్యూ అధికారులు గిరిజనులు సాగు చేసుకున్న పసుపు పంటను... మళ్లీ తొలగించారు. జనవరివలో అధికారులు ఇలానే చేస్తే.. సబ్ కలెక్టర్​కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మళ్లీ పంటలు వేయగా వాటిని ఇళ్ల స్థలాల కోసం .. దౌర్జన్యంగా ధ్వంసం చేశారు.

జిల్లా అధికారుల చుట్టూ పట్టాల కోసం తిరిగినా పట్టించుకునే నాథుడే లేడని బాధితులు వాపోయారు. ఇప్పుడు రండి... రేపు రండి అంటూ కాలాయాపాన చేస్తున్నారే తప్ప... పట్టాల ఊసే తీయట్లేదని గిరిజనులు అన్నారు. చట్టప్రకారం పోడు భూములకు... పట్టాలు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆ ప్రాంతాన్ని భాజాపా నాయకులు పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గిరిజనులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details