ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుందిగూడాలో అనారోగ్యంతో గిరిజనుడు మృతి

విశాఖ జిల్లా అరకు మండలం కుందిగూడాలో అనారోగ్యంతో ఓ గిరిజనుడు మృతి చెందాడు. కరోనా వ్యాక్సిన్ వికటించడం వల్లే అతను మృతి చెందినట్లు బంధువులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

కుందిగూడాలో అనారోగ్యంతో గిరిజనుడు మృతి
కుందిగూడాలో అనారోగ్యంతో గిరిజనుడు మృతి

By

Published : Mar 28, 2021, 10:26 PM IST

విశాఖ జిల్లా అరకు మండలం కుందిగూడాలో దూసరి దోన్ను అనే వ్యక్తి ఈ నెల 19 న గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఆ రోజు నుంచి అతను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ఐదు రోజులైనా జ్వరం తగ్గకపోవడంతో గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స కోసం వెళ్లాడు. అక్కడి సిబ్బంది మాత్రలు ఇచ్చి బాధితున్ని ఇంటికి పంపించారు. అయినప్పటికీ జ్వరం తగ్గకపోగా... తలనొప్పి, ఒళ్లు నొప్పులతో ఆదివారం మృతి చెందాడు.

కరోనా వ్యాక్సిన్ వికటించడం వల్లే దోన్ను మరణించాడని గ్రామస్థులు, బందువులు ఆరోపించారు. బాధితుని మృతిపై అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని గిరిజన సంఘం నాయకులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: కర్నూలు విమానాశ్రయంలో సేవలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details