ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tribal Marriage: గిరిజన వేషధారణలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వివాహం

గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే గిరిజన వేషధారణతో పెళ్లి కొడుకుగా మారారు. గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా ఆయన వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇంతకు ముందే వివాహం జరిగింది కదా.. మళ్లీ పెళ్లి చేసుకోవటమేంటని ఆశ్చర్యపోతున్నారా..?. అయితే ఇది చదవాల్సిందే.

గిరిజన వేషధారణలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వివాహం
గిరిజన వేషధారణలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వివాహం

By

Published : Jan 11, 2022, 10:57 PM IST

గిరిజన వేషధారణలో దండే దంపతులు

విశాఖ జిల్లా అరకు లోయ సమీపంలోని గిరి గ్రామదర్శిని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే తన సతీమణితో కలిసి ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెను గిరిజన సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు.

సంప్రదాయ ఆభరణాలు, పంచె కట్టుతో నూతన వధూవరులు పెళ్లి పీటలు ఎక్కారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గోపాల కృష్ణ పెళ్లి పెద్దగా వ్యవహరించి వివాహ తంతు పూర్తి చేయించారు. అనంతరం గిరిజన సంప్రదాయ నృత్యం దింసాతో కాంతిలాల్ దండే దంపతులు కాలు కదిపారు. ఇద్దరూ కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.

దండే దంపతులతో ఐటీడీఏ అధికారి గోపాలకృష్ణ

అంతకుముందు పద్మాపురం ఉద్యానవనం, గిరిజన మ్యూజియాన్ని కాంతి లాల్ సందర్శించారు. పర్యటకులు అరకులోయ సందర్శించేందుకు వీలుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి : గిరిజన బిడ్డలుగా మారిపోయిన శోభా స్వాతిరాణి దంపతులు

ABOUT THE AUTHOR

...view details