విశాఖ జిల్లా పాడేరు మండలం మారుమూల గ్రామం సలుగు పంచాయతీ పరిధిలోని బిడారిగరువులో ఏళ్ల తరబడిగా రహదారి సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. గ్రామస్తులందరూ చందాలు వేసుకుని మూడు కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించుకునేందుకు సమాయత్తమయ్యారు. జేసీబీ సహాయంతో కొండ మార్గాన్ని చదును చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
అధికారుల ప్రవర్తనతో విసిగి... చందాలు వేసుకుని..! - విశాఖపట్నం జిల్లా నేటి వార్తలు
విశాఖ జిల్లాలోని ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో సరైన రహదారులు లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో స్వయంగా రోడ్డు నిర్మించుకునేందుకు ముందడుగు వేశారు.
స్యయంగా రోడ్డును నిర్మించుకుంటున్న గ్రామస్థులు