ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాచ్​ఖండ్ జలవిద్యుత్తు కేంద్రం సమీపంలో ఆందోళన - మాచ్​ఖండ్ లో గిరిజనుల నిరసన వార్తలు

విశాఖ జిల్లా మాచ్​ఖండ్ జలవిద్యుత్ కేంద్ర ప్రాంతంలో... వైద్య సేవలను ప్రైవేట్​పరం చేయడంపై గిరిజనులు ఆందోళనకు దిగారు.

ఆందోళన చేస్తున్న గిరిజనులు

By

Published : Nov 21, 2019, 5:35 PM IST

మాచ్​ఖండ్ జలవిద్యుత్తు కేంద్రం సమీపంలో ఆందోళన

ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్​ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ప్రాంతంలో... వైద్య సేవలను ప్రైవేట్​పరం చేయడంపై గిరిజనులు ఆందోళన చేశారు. అధికారులతో ఆందోళనకారుల చర్చలు విఫలం కావడంతో... జల విద్యుత్ కేంద్రానికి చెందిన డుడుమ జలాశయం గేట్లు మూసేశారు. ప్రాజెక్టులో విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోవడంతో... ప్రతీ గంటకు 90 మెగావాట్ల ఉత్పత్తి నష్టం జరిగింది. రాత్రి వరకు చర్చలు జరిపితే... ప్రైవేటు సంస్థ వారు సీటీ స్కాన్, ఎక్స్​రే వంటి అత్యాధునిక వసతులను సమకూర్చి ప్రారంభించాలని కోరారు. వైద్య సేవలు అందని కారణంగా... 2 నెలల వ్యవధిలో ఆరుగురు గిరిజనులు మృతిచెందారని వారికి... పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు దీనికి ఒప్పకోకపోవడంతో... గిరిజనులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details