విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో చీమలపాడుకు చెందిన గిరిజనులు ఆందోళన చేపట్టారు. రోలుగుంట, రావికమతం మండల రెవెన్యూ అధికారులపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. భూమి యజమానుల ప్రమేయం లేకుండా వివిధ గ్రామాల్లో రైతుల రికార్డులను తారుమారు చేశారని వారు ఆరోపించారు.
అధికారుల నిర్లక్ష్యం, అవినీతితో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందున్న రహదారిపై బైఠాయించారు. రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.