అమరవీరుల త్యాగాలకు గుర్తుగా 20 మెుక్కలు - vishakapatnam latest news
చైనా బోర్డర్లో అమరులైన 20 మంది భారత్ సైనికులకు గుర్తుగా విశాఖ మధురవాడ మిధిలపురి వుడా కాలనీలో జన జాగృతి సంస్థ ఆధ్వర్యలో 20 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.
మెుక్కలు నాటుతున్న జనజాగృతి కార్యకర్తలు
విశాఖపట్నంలోని మధురవాడ మిధిలపురి వుడా కాలనీలో జనజాగృతి ఆధ్వర్యంలో అమరులైన 20 మంది భారత్ సైనికులకు గుర్తుగా 20 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, భీమిలి జనసేన ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల పాల్గొన్నారు. ముందుగా వారికి నివాళులర్పించి..అనంతరం ర్యాలీగా వెళ్లి మొక్కలు నాటారు.