ఖజానా ఉద్యోగుల సంఘం విభజన అంటూ వేర్వేరుగా సమావేశాలు పెట్టి ఉద్యోగులను అయోమయానికి గురి చేయడం సరికాదని ఆ సంఘం అధ్యక్షుడు రవి కుమార్ అన్నారు. తమ సంఘ కార్యవర్గానికి 2022 ఫిబ్రవరి వరకు పదవీ కాలం ఉందన్నారు. ఇటువంటి గందరగోళపరిచే ప్రయత్నాలను.. చీలికకు ప్రయత్నిస్తున్న సహచర ఉద్యోగులు మానుకోవాలని కోరారు. సమస్యలు ఉంటే అందరూ సమావేశమై పరిష్కరించుకోవాలన్నదే సంఘం ఉద్దేశమన్నారు.
'రాష్ట్ర ఖాజానా ఉద్యోగుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం మానుకోవాలి' - ట్రెజరీ ఉద్యోగుల సంఘం వివాదం వార్తలు
రాష్ట్రంలో ఖజానా ఉద్యోగుల్లో చీలిక తెచ్చేవిధంగా అప్రజాస్వామికంగా.. సంఘాన్ని విభజించేందుకు చేస్తున్న యత్నాలు ఫలించబోవని రాష్ట్ర ఖజానా ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గోవింద రవి కుమార్, రమణా రెడ్డి వెల్లడించారు.

'రాష్ట్ర ఖాజానా ఉద్యోగుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం మానుకోవాలి'
కొంతమంది పదవులు కావాలనే కాంక్షతో.. మాతృ సంఘంగా ఉన్న ఏపీఎన్జీవోల సంఘం మద్దతు ఉందని చెప్పడం సరికాదన్నారు.
ఇదీ చదవండి:పొలం కబ్జాకు వైకాపా నేతల యత్నం...కత్తితో పొడుచుకున్న కౌలు రైతు !