విశాఖ జిల్లా పెందుర్తి ప్రధాన రహదారిపై అర్థరాత్రి ఓ వ్యక్తి స్పృహలేకుండా పడి ఉన్నాడు. వేగంగా వచ్చే వాహనదారులు అతన్ని గమనించి అకస్మాత్తుగా వాహనాలను నియంత్రించలేక ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారి నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గం కావటంతో రాత్రి సమయంలోనూ భారీ వాహనాల రద్దీ ఉంటుంది. ఈ సంఘటన పోలీస్‌స్టేషన్‌కు అడుగుల దూరంలోనే జరిగింది. అయినా పోలీసులు కూడా పరిస్థితిని గమనించలేకపోయారు.
ప్రమాదం అంచున పడి ఉన్న వ్యక్తి...పట్టించుకోని దైన్యం.. - pendurti main road news
అర్థరాత్రి నడిరోడ్డు మధ్యలో స్పృహ లేకుండా ఓ వ్యక్తి పడి ఉన్నాడు. దీంతో వచ్చిపోయే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విశాఖ నగరశివారులోని పెందుర్తి ప్రధాన రహదారిపై జరిగిన సంఘటన ఇది.
![ప్రమాదం అంచున పడి ఉన్న వ్యక్తి...పట్టించుకోని దైన్యం.. man on road](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9436771-841-9436771-1604554050606.jpg)
వ్యక్తి పక్క నుంచి వెళ్తున్న భారీ వాహనాలు