రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంలో రవాణా శాఖ ప్రధాన వనరు. కరోనా వల్ల మార్చి నుంచి జూన్ వరకు ఆదాయం పడిపోయింది. లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత జూన్ ఆఖరు వారం నుంచి వాహన రిజిస్ట్రేషన్లు కాస్త ఊపందుకున్నాయని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. శ్రావణ మాసం సెంటిమెంట్ కూడా తోడుకావడంతో...కొనుగోళ్లు పెరిగి ఆదాయం పుంజుకుందని అంటున్నారు.
వాహన కొనుగోలుదారులు ఇబ్బందులు పడకుండా రవాణాశాఖ అధికారులు ఆన్‌లైన్ సేవలు అందిస్తున్నారు. కార్యాలయానికి వెళ్లే పని లేకుండా అంతా ఆన్‌లైన్‌లో సేవలు పొందాలని సూచిస్తున్నారు.