కరోనాతో కుదేలైన లారీ ట్రాన్స్ పోర్ట్ విభాగంపై ప్రభుత్వం కనికరం చూపించాలని విశాఖ లారీ ఓనర్ల సంఘం వేడుకుంది. వీజేఎఫ్ క్లబ్లో జరిగిన సమావేశంలో మీడియాతో లారీ రవాణా విభాగం ప్రతినిధులు మాట్లాడారు.
కరోనా సమయం నుంచి లారీ రవాణా వ్యాపారం బాగోలేదని చెప్పారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం రాయితీ కానీ.. వెసులుబాటు కానీ ఇవ్వలేదని అన్నారు. దానికితోడు పెరిగిన డీజిల్ ధరలు ఊపిరి సలపనివ్వడం లేదని వాపోయారు. బలవంతంగా ఆశీలు(Tax) వసూలు చేయడం తగదని అంటున్నారు.